జీవీఎంసీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు జూమ్ సమావేశంలో పాల్గొన్న మళ్ళా సురేంద్ర
🗞️ బిబి న్యూస్ | 11 Oct 2026
అనకాపల్లి, అక్టోబర్ 11 (బీబీ న్యూస్): గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన జూమ్ వీడియో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మళ్ళా సురేంద్ర పాల్గొన్నారు.జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ సమావేశంలో మళ్ళా సురేంద్ర పాల్గొని ఎన్నికల సన్నాహాలపై జరిగిన చర్చలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, క్షేత్రస్థాయి సమన్వయం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.భీమిలి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మళ్ళా సురేంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.