📢 Advertisement Space

అనకాపల్లి అవినాష్ పవర్ జిమ్ సభ్యులు మిస్టర్ ఆంధ్ర బాడీబిల్డింగ్‌లో ప్రతిష్ఠాత్మక విజయాలు

🗞️ బిబి న్యూస్ | 26 Feb 2026

అనకాపల్లి, ఫిబ్రవరి 26: ఈ నెల 22, 23 తేదీల్లో కాకినాడ, విశాఖపట్నం నగరాల్లో జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీబిల్డింగ్ పోటీల్లో అనకాపల్లి అవినాష్ పవర్ జిమ్ సభ్యులు అద్భుత విజయాలు సాధించారు. పినపోతుల సంతోష్ ప్రథమ స్థానం, పి. ప్రసాద్ ద్వితీయ స్థానం సాధించి పట్టణానికి గర్వకారణం అయ్యారు.ఈరోజు జిమ్ ఆవరణలో జరిగిన సమావేశంలో ఈ ఇరువురిని జిమ్ చైర్మన్, న్యాయవాది ఐ.ఆర్. గంగాధర్ సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంగాధర్, జిమ్ సభ్యుల అంకిత దీక్షతను కొనియాడారు. "అనకాపల్లి పట్టణానికి గుర్తింపు తెచ్చేలా శ్రమించారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో యువత తన లక్ష్యాలను సాధించాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని బాధ్యతగల పౌరులుగా మెలగాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి" అని హితవు పలికారు.కార్యక్రమంలో యువ న్యాయవాది ఇళ్ళ అవినాష్, జిమ్ మేనేజర్ గొర్లె స్వామి గౌడ్, బుద్ధ గణేష్, బుచ్చిరాజు, చల్ల నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి గోపి, కర్రి చిన్న, రాజు, శ్రీరామ్ మూర్తి మాస్టారు పాల్గొన్నారు.