📢 Advertisement Space

జీవీఎంసీ ఎన్నికలపై గంటా శ్రీనివాసరావుతో మళ్ళా సురేంద్ర కీలక చర్చలు

🗞️ బిబి న్యూస్ | 15 Oct 2026

భీమిలి, అక్టోబర్ 15 (BB NEWS):
రాబోయే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో భీమిలి నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో గురువారం మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావును ఆయన స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ గవర కార్పొరేషన్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ పరిశీలకులు మళ్ళా సురేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గ పరిధిలోని వార్డుల రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.ముఖ్యంగా ఆయా వార్డుల్లో ప్రజలతో సంబంధాలు కలిగి, స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.అలాగే ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల సమన్వయం, క్షేత్రస్థాయి పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై అభిప్రాయాలను పంచుకున్నారు. జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి గంటా శ్రీనివాసరావు, మళ్ళా సురేంద్ర మధ్య జరిగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.