📢 Advertisement Space

సేవా నేపథ్యంతో ఎన్నికల బరిలో కోరిబిల్లి నూక భారతి

🗞️ బిబి న్యూస్ | 19 Oct 2026

అనకాపల్లి: జీవీఎంసీ 109వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కోరిబిల్లి నూక భారతి మహిళల ఆశీస్సులతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రముఖ సంఘ సేవకుడు, సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోరిబిల్లి పరి సతీమణిగా ఆమె ఎన్నికల బరిలో నిలిచారు.అనకాపల్లి జిల్లాలో రక్తదాన సేవా కార్యక్రమాలతో కోరిబిల్లి పరి ప్రత్యేక గుర్తింపు పొందారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన ఎంతోమందికి సహాయం అందిస్తూ, ఎలాంటి రాజకీయ పదవి లేకుండానే సామాజిక సేవలో కొనసాగుతున్నారని ఆయన అనుచరులు పేర్కొన్నారు.భర్త సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకున్న నూక భారతి ప్రజాప్రతినిధిగా వార్డు అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె మద్దతుదారులు చెబుతున్నారు.సామాజిక సేవలో గుర్తింపు పొందిన కుటుంబానికి రాజకీయంగా అవకాశం లభిస్తే మరింత ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుందని అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోరిబిల్లి పరి సేవా నేపథ్యం నూక భారతి ఎన్నికల విజయానికి ఎంతవరకు దోహదపడుతుందనేది 109వ వార్డులో ఆసక్తికరంగా మారింది.