107వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా మాదంశెట్టి చినతల్లి నీలబాబు
🗞️ బిబి న్యూస్ | 20 Oct 2026
టీడీపీలో సీనియర్ నాయకుడిగా నీలబాబు సేవలు మరువలేనివి....
ఈసారి చినతల్లి నీలబాబును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటున్న స్థానిక ప్రజలు....
అనకాపల్లి, బీబీ న్యూస్:గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 107వ డివిజన్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా మాదంశెట్టి చినతల్లి నీలబాబు ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న నీలబాబుకు స్థానికంగా మంచి గుర్తింపు ఉందని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడుతున్నారు.తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ, కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడిగా నీలబాబును ఆయన అనుచరులు అభివర్ణిస్తున్నారు.పదవులతో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ఆయన ప్రత్యేకతని చెబుతున్నారు. రాజకీయాల్లో అనుభవం, ప్రజలతో సత్సంబంధాలు, సేవాభావం కలిగిన నాయకుడిగా నీలబాబు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని మద్దతుదారులు పేర్కొంటున్నారు.ఈసారి చినతల్లి నీలబాబు విజయం ఖాయమని, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు చెబుతున్నట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని, డివిజన్ అభివృద్ధికి అనుభవజ్ఞులైన నాయకుల సేవలు ఎంతో అవసరమని అభిప్రాయపడుతున్నట్లు తెలిపాయి.107వ డివిజన్‌లో తాగునీరు,రహదారులు,డ్రైనేజీ వ్యవస్థ,పారిశుద్ధ్యం,వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని కూటమి అభ్యర్థి పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కూటమి సహకారంతో 107వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.అభివృద్ధి,సంక్షేమం,ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, అక్టోబర్ 28న జరిగే పోలింగ్‌లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాదంశెట్టి చినతల్లి నీలబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులు, కూటమి నాయకులు,కార్యకర్తల సహకారంతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు