గవరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి పునర్నిర్మాణ మహోత్సవ ఆహ్వానపత్రికలు విడుదల
🗞️ బిబి న్యూస్ | 26 Feb 2026
అనకాపల్లి, ఫిబ్రవరి 26: ఉత్తరాంధ్ర ఇలవేల్పు క్షేత్రమైన గవరపాలెం శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పున్రిర్మాణ కలశ స్థాపన, ప్రతిష్ఠ మహోత్సవాలకు ఆహ్వానపత్రికలు గురువారం మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తింపు పొందిన ఈ శ్రీ అమ్మవారి పండుగ ఈ నెల 8 తేదీ మార్చితో ఘనంగా జరగనుంది.ఈ సందర్భంగా మాట్లాడిన కొణతాల రామకృష్ణ, ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు పూర్తి శ్రద్ధతో, ఎలాంటి లోపాలు లేకుండా జరగాలని అధికారులకు సూచించారు. భక్తజనులు అందరూ ఈ మహోత్సవంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహ కమిషనర్ శ్రీధర్, ధర్మకర్తలు సూరే సతీష్ కుమార్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్ కుమార్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్చవరపు సంతోషి కుమారి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.