మునగపాక: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మునగపాక మండలంలో ఎన్నికల సరళిని మండల ఎన్నికల పరిశీలకులు చందు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు చందు మునగపాక మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఎన్నికల నిర్వహణ తీరును, పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. గ్రామాల్లో నెలకొన్న ఎన్నికల పరిస్థితులను స్థానిక నాయకులు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తూ పోలింగ్ సరళిని పరిశీలించారు.