శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం పునప్రారంభోత్సవానికి గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్రకు ఆహ్వానం
🗞️ బిబి న్యూస్ | 27 Feb 2026
అనకాపల్లి, ఫిబ్రవరి 27: మార్చి 8న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం పునప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది.ఈ సందర్భంగా ఆలయ ఈఓ శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీను మరియు ఆలయ ధర్మకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, కృష్ణకుమారి దంపతులను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి,ఆహ్వానపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన మళ్ళ సురేంద్ర, ప్రజలంతా ఆలయ గర్భగుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వంలో ఈ ఆలయం అంగరంగవైభవంగా పునప్రారంభోత్సవం జరగడం ప్రజలకు ఆనందాన్ని కలిగించిందని అన్నారు. "ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని, కమిటీకి శుభాకాంక్షలు" అని తెలిపారు.