అనకాపల్లి 112వ డివిజన్ ఏఎంసీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శ్రీకారం
🗞️ బిబి న్యూస్ | 18 Nov 2026
అనకాపల్లి, బీబీ న్యూస్:అనకాపల్లి పట్టణంలోని 112వ డివిజన్ పరిధిలో గల ఏఎంసీ కాలనీ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి. కాలనీలో నూతన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులను బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 112వ డివిజన్ కూటమి కార్పొరేటర్ ఆళ్ల వైష్ణవి తండ్రి ఆళ్ల రామచంద్రరావు, 112వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలరపు త్రినాథ్, జీవీఎంసీ అధికారులు, నిర్మాణ పనుల కాంట్రాక్టర్లు, ఏఎంసీ కాలనీకి చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఏఎంసీ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కాలనీ ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే కాలనీలో జరిగే సమావేశాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు, పనుల ప్రారంభానికి సహకరించిన మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కేంద్ర రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకీ, విశాఖపట్నం మేయర్ డాక్టర్ ముక్కా శ్రావణికి నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వీరందరి మార్గదర్శకత్వంతో పాటు జీవీఎంసీ ఉన్నతాధికారుల సహకారంతో నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేస్తామని, త్వరలోనే కమ్యూనిటీ హాల్‌ను కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని నాయకులు వెల్లడించారు.కాలనీ అభివృద్ధిలో భాగంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం మరో ముందడుగు అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.