హిందూజా బొగ్గు లారీలను నిలుపుదల చేయాలి.కలెక్టర్ కిఫిర్యాదు చేసిన సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి
🗞️ బిబి న్యూస్ | 02 Mar 2026
పరవాడ మండలపరవాడ సినిమా హాల్ జంక్షన్ హిందూజా బొగ్గు లారీలనుఈ మార్గం మీదగా నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కి సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. గని శెట్టి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. హిందూజా బొగ్గు లారీలనుఈ మార్గం మీదగా ప్రయాణించడం వలన తీవ్రమైన బొగ్గు ఈ రోడ్లపై పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లారీలు నిండు ధూళి రోడ్లపై పడిప్రజలు ఈ మార్గంలో ప్రయాణించడమే నరకంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.పరవాడ ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్, సినిమా హాల్ జంక్షన్, సబ్ స్టేషన్, ఊట గడ్డ, లంకెలపాలెం గ్రామం పూర్తిగా ధూళితో మూసి వేయబడింది. ఈ గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది . అధిక లోడుతో ప్రయాణిస్తున్న లారీలపై ఆర్టీవో అధికారులు దాడులు చేసికేసులు నమోదు చేయాలని కోరారు. ఈ మార్గంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, రోడ్లు పూర్తిగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి . హిందూజా కి రైల్వే ద్వారా బొగ్గు తరలించుకోవాలని కోరారు. హిందూజా కంపెనీ బొగ్గు లారీలకు బదులుగా రైల్వే మార్గం ద్వారా బొగ్గు తరలించుకోవాలి తప్ప ఈ మార్గంలో ప్రయాణించడం వలన ప్రజల తీవ్ర అనారోగ్యాలుకి, జబ్బులకు గురవుతున్నారని తెలియజేశారు. ఈ మార్గం నుండి బొగ్గు లారీలు నిలుపుదల చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం హిందూజా కంపెనీకి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి. ఆర్టీవో అధికారి కి వెంటనే చర్యలు చేపట్టమని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో గని శెట్టి మరో పత్రం ఆర్టీవో అధికారులకు కూడా అందజేశారు.