ప్రజా ఫిర్యాదుల వేదికలో 40 ఫిర్యాదుల స్వీకరణ – సత్వర పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
🗞️ బిబి న్యూస్ | 02 Mar 2026
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మొత్తం 40 ఫిర్యాదులను స్వీకరించారు.
భూ తగాదాలు – 30, కుటుంబ కలహాలు – 2,
ఇతర విభాగాలకు చెందినవి – 8
ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా సంబంధిత అధికారులను ఆదేశిస్త
“ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలి. 7 రోజుల్లోపు విచారణ పూర్తిచేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చేపట్టిన చర్యల నివేదికలను జిల్లా పోలీసు కార్యాలయానికి తప్పనిసరిగా సమర్పించాలి,” అని స్పష్టం చేశారు.ఫిర్యాదు దారులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ —
“ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత. ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారు,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.