📢 Advertisement Space

అనకాపల్లి మండలంలో రూ. 2.57 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.

🗞️ బిబి న్యూస్ | 03 Mar 2026

అనకాపల్లి ,మార్చి 3: అనకాపల్లి మండలంలో సుమారు రూ. 2 కోట్ల 57 లక్షల 50 వేల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి, శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ సారథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.మాజీ శాసనసభ్యుడు, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ సహకారంతో ఈ కార్యక్రమాలు జరిగాయి.మామిడిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా నిధులతో రూ. 1 కోటి 47 లక్షల 50 వేల రూపాయల విలువైన నూతన తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అదే విధంగా,పంచాయతీరాజ్ శాఖ గ్రామపంచాయతీ నిధులతో నూతన సచివాలయం మరియు ఎస్సీ కాలనీలో పార్కుకు ప్రారంభోత్సవం నిర్వహించారు.తగరంపూడి గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఉత్తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులతో రూ. 1 కోటి 10 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ,శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమాల్లో మాజీ శాసన మండల సభ్యుడు బుద్ధ నాగ జగదీష్ ,గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ,డిసిఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ , మండల టీడీపీ అధ్యక్షుడు కర్రి బాబి ,ప్రభుత్వ అధికారులు, స్కూల్ ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.