మహిళా శక్తికి వందనం - అనకాపల్లి జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 03 Mar 2026
అనకాపల్లి,మార్చి 03: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మహిళా సాధికారత, ఆరోగ్యం మరియు సామాజిక బాధ్యత అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ వారోత్సవాలను చేపట్టారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా పోలీసులు,మహిళా సంరక్షణ కార్యదర్శులు (GMSKs) మరియు ప్రజల భాగస్వామ్యంతో రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.నక్కపల్లి పరిధిలో నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ మురళి, ఎస్సైలు సన్నీ బాబు, సాహిబా అంజుమ్ ఆధ్వర్యంలో తునిలోని రాహుల్ లాపరోస్కోపీ హాస్పిటల్ మరియు మదర్ బ్లడ్ సెంటర్ సహకారంతో భారీ రక్తదాన శిబిరం, ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు.అనకాపల్లి టౌన్‌లో డీఎస్పీ శ్రీమతి ఎం. శ్రావణి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్,ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటనారాయణ,ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళా సిబ్బంది,GMSKలు పాల్గొన్నారు.నర్సీపట్నం టౌన్ ఇన్‌స్పెక్టర్ గఫూర్, ఎస్సై ఉమామహేశ్వరరావు ఎస్సీ బాలికల హాస్టల్‌లో మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఎలమంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) వద్ద టౌన్,రూరల్ ఎస్సైలు సావిత్రి, ఉపేంద్ర ఆధ్వర్యంలో మహిళా సిబ్బంది మరియు ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.అచ్యుతాపురం పోలీస్ స్టేషన్‌లో పవన్ సాయి హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడుతూ,“సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిది.మహిళల భద్రత,ఆరోగ్యం లక్ష్యంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాం అని పేర్కొన్నారు.