అమరావతిలో అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం: చంద్రబాబు అధ్యక్షత
🗞️ బిబి న్యూస్ | 06 Mar 2026
అమరావతి, మార్చి 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షత వహించిన సందర్భంగా శుక్రవారం అమరావతిలో అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ,శాసనసభ సభాపతి, నర్సీపట్నం శాసనసభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు,హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర , అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్, జిల్లా సహచర శాసనసభ్యులు పాల్గొన్నారు.సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత కొణతాల రామకృష్ణ ముఖ్యమంత్రి వారిని దుస్సాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేసి గౌరవించారు.