అనకాపల్లి నెహ్రూ చౌక్‌లో విద్యార్థుల 'ఫ్లాష్ మాబ్':మహిళా సాధికారతపై అవగాహన
🗞️ బిబి న్యూస్ | 06 Mar 2026
అనకాపల్లి, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా మహిళల రక్షణ, సాధికారతపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లి పట్టణ పోలీసులు నిర్వహించిన 'ఫ్లాష్ మాబ్' ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.దాడి వీరు నాయుడు డిగ్రీ కళాశాల విద్యార్థులు నెహ్రూ చౌక్ వద్ద జరిపిన ఈ వినూత్న కార్యక్రమం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ పర్యవేక్షణలో నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.మహిళా రక్షణ,సాధికారత ఇతివృత్తంతో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ప్రదర్శనలు ప్రజల్లో ఆలోచనను రేకెత్తించాయి.ఈ ఫ్లాష్ మాబ్‌ను చూసిన ప్రజలు ఆసక్తిగా తిలకించి, విద్యార్థుల ప్రతిభ,పోలీస్ శాఖ చొరవను అభినందించారు.కార్యక్రమంలో అనకాపల్లి టౌన్ సీఐ ప్రేమ్ కుమార్,మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నీలిమ, పోలీస్ సిబ్బంది,కళాశాల ప్రిన్సిపాల్,పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.