కక్ష సాధింపులకు మద్దతు పలికిన జీవీఎంసీ అధికారులు- 80 వ వార్డు కార్పొరేటర్ దుకాణాలు కూల్చివేత...
🗞️ బిబి న్యూస్ | 06 Mar 2026
అనకాపల్లి,బీబీ న్యూస్: అనకాపల్లి పట్టణంలో శ్రీ నూకాంబిక ఆలయం ఎదురుగా జీవీఎంసీ అధికారులు షాపులను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనకాపల్లి 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమా భాస్కర్ ప్రైవేటు స్థలంలో రోడ్డుకు 10 అడుగుల దూరంలో నిర్మించిన ఆరు షాపులను జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు జోనల్ కమిషనర్ చక్రవర్తి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కూల్చేశారు.అనుమతులు లేకుండా రోడ్డు విస్తరణ సమయంలో నిర్మించిన షాపులు అక్రమమని జీవీఎంసీ చెప్పుకొచ్చింది.ఎటువంటి నోటీసు ఇవ్వకుండా జరిగిన ధ్వంసంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.జరిగిన విషయం తెలుసుకుని స్థలానికి చేరుకున్న నీలిమా భాస్కర్ అధికారుల తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించారు.ఆరు కుటుంబాలు ఈ షాపుల్లో చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాయని,రుసుము చెల్లించి నిర్మించామని చెప్పారు.స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా తనకు సమాచారం ఇవ్వకుండా చర్య తీసుకోవడం సరైనది కాదని, 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ నేపథ్యం వైసిపి నుంచి గెలిచిన నీలిమా భాస్కర్ ఆరు నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. మరియు మాజీ మంత్రి డాడి వీరభద్రరావు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు.ఇది రాజకీయ కక్షతతో జరిగిన చర్య అని ఆరోపించారు. ఇతర రోడ్డు ఆక్రమణాలను పట్టించుకోకుండా తన షాపులను మాత్రం ధ్వంసం చేశారని విమర్శించారు.పోలీస్ జోక్యంఅనేక మంది మద్దతుదారులతో ధర్నా జరుగుతుండటంతో పోలీసులు స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.నీలిమా భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం జరగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు.కొంతమంది తనపై అక్కసుతో దుశ్చర్యకు గురిచేశారని ఆరోపించారు.ఈ సంఘటనతో నూకాంబిక ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఈ నిరసనలో నీలిమా భాస్కర్ న్యాయం జరిగే వరకు చావడానికైన సిద్ధం అని అనకాపల్లి చరిత్రలో ఎన్నడూ ఇటువంటివి జరగలేదని నష్టపరిహారం తప్పక ఇవ్వాలని డిమాండ్ చేశారు.