పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.10 పాసై ఉద్యోగం లేనివారికి యువసాథి స్కీమ్ ద్వారా నెలకు రూ. 1500 నిరుద్యోగ భృతి అందించనున్నట్టు వెల్లడించారు. 21-40 ఏళ్ల వారికి వర్తిస్తుందని తెలిపారు. నేటి నుంచే ఈ డబ్బులు నిరుద్యోగుల ఖాతాల్లో జమకానున్నట్టు తెలిపారు. తమ పాలనలో నిరుద్యోగ రేటు 40శాతానికి తగ్గిందని దాదాపు 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించామన్నారు.