నేషనల్ వాలీబాల్ సబ్-జూనియర్స్ టీమ్ ఎంపికైన క్రీడాకారులకు గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర అభినందనలు
🗞️ బిబి న్యూస్ | 17 Feb 2026
అనకాపల్లి పట్టణం గవరపాలెం దిబ్బవీధి కొబ్బరి తోట లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ వాలీ బాల్ సబ్ జూనియర్స్ టీమ్ సెలక్షన్ లో ఎంపికైన 18 మంది బాయ్స్ టీమ్,ట్రైనింగ్ కార్యక్రమానికి ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర పాల్గొని,క్రీడాకారులు తో మాటలాడతూ నేషనల్ టీమ్ కు సెలెక్ట్ అయిననందుకు అభినందనలు తెలుపుతూ మీరు ఈ శిక్షణ కార్యక్రమం లో బాగా ప్రాక్టీస్ చేసి ఈ నెల 25 న వెస్ట్ బెంగాల్ లో జరిగే నేషనల్ టీమ్ లో బాగా ఆడాలని రాష్టానికి మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జగన్నాథ స్వామి దేవస్థానం చైర్మన్ దాడి బుజ్జి,ఆర్గనైజర్స్ దాడి శ్రీను,యల్లపు గోవింద్,బుద్ధ శివ, పీలా రమణారావు,,మరియు తదితరులు పాల్గొన్నారు.