📢 Advertisement Space

అనకాపల్లి అభివృద్ధికి మార్గదర్శి – మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ

🗞️ బిబి న్యూస్ | 08 Mar 2026

అనకాపల్లి పట్టణ అభివృద్ధి చరిత్రలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేరు ప్రత్యేకంగా నిలిచిపోయిందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆయన రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాతే అనకాపల్లి అభివృద్ధికి నిజమైన దిశ దొరికిందని పలువురు చెబుతున్నారు.
పెందుర్తి ప్రాంతానికి చెందిన పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లిని తన రాజకీయ కార్యాచరణకు కేంద్రంగా చేసుకుని ప్రజలకు చేరువయ్యారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకుడిగా, పేదవారి కుటుంబ సభ్యుడిలా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు కృషి చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.తెలుగుదేశం పార్టీని విశ్వసించి రాజకీయాల్లో ముందుకు వచ్చిన ఆయనకు కొన్ని సందర్భాల్లో పార్టీ నుండి టికెట్ లభించకపోయినా పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోకుండా పనిచేసిన నాయకుడిగా పేరుగాంచారు.అదే సమయంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు కూడా తనదైన విధంగా సహకారం అందిస్తూ రాజకీయంగా చురుకుగా కొనసాగారు.అనకాపల్లి ప్రజలు ఎంతో విశ్వసించే శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం అభివృద్ధికి కూడా పీలా గోవింద సత్యనారాయణ విశేష కృషి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సహకరించారు.ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడిగా ఆయన పేరు నిలిచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనకాపల్లి అభివృద్ధి ప్రయాణంలో పీలా గోవింద సత్యనారాయణ చేసిన సేవలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు.