📢 Advertisement Space

అనకాపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు – మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పీలా గోవింద సత్యనారాయణ

🗞️ బిబి న్యూస్ | 08 Mar 2026

అనకాపల్లి, మార్చి 8:
అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.దేశంలోనే మహిళల ఆర్థికాభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని ఆయన తెలిపారు. మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగడానికి డ్వాక్రా సంఘాలు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడపిల్లలను భారంగా భావించకుండా వారికి ఉన్నత విద్యను అందించాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, టీడీపీ మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.