అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 08 Mar 2026
అనకాపల్లి, మార్చి 8:
అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ శచీదేవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జాయింట్ కలెక్టర్ సోలమన్ పటేల్, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్లా సురేంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచి అభివృద్ధి సాధించిన మహిళలను అభినందించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ స్థాయి అధికారులు,మహిళా ప్రతినిధులు మరియు వివిధ విభాగాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.మహిళల సాధికారతకు ఇటువంటి కార్యక్రమాలు ప్రేరణగా నిలుస్తాయని అధికారులు తెలిపారు.