📢 Advertisement Space

ప్రజా ఫిర్యాదుల వేదికలో 42 ఫిర్యాదులు స్వీకరణ – సత్వర పరిష్కారానికి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు

🗞️ బిబి న్యూస్ | 09 Mar 2026

అనకాపల్లి, మార్చి 9:అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మొత్తం 42 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఎస్పీ స్వయంగా విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా అందిన ఫిర్యాదులలో భూ తగాదాలకు సంబంధించినవి 27, కుటుంబ కలహాలకు సంబంధించినవి 2, మోసపూరిత వ్యవహారాలకు సంబంధించినవి 2 ఉండగా, ఇతర విభాగాలకు చెందినవి 11 ఫిర్యాదులు ఉన్నాయి.
ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు.ఫిర్యాదులపై 7 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చేపట్టిన చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.అంతేకాకుండా ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ, ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు సహా ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.