📢 Advertisement Space

అనకాపల్లి బాలోత్సవాల్లో కేంబ్రిడ్జ్ స్పేస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

🗞️ బిబి న్యూస్ | 10 Mar 2026

కసింకోట:అనకాపల్లిలో శ్రీ బాలానంద కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవాలు – పిల్లల పండుగలో కసింకోటకు చెందిన కేంబ్రిడ్జ్ స్పేస్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటుతూ అనేక పోటీల్లో విజేతలుగా నిలిచారు.వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులు సాధించి పాఠశాలకు కీర్తి తీసుకువచ్చారు.
క్విజ్ పోటీ (జూనియర్ విభాగం):
ఓ. మహేంద్ర భార్గవ్ – ప్రథమ బహుమతి
వ్యాసరచన (తెలుగు):
సీనియర్ విభాగం – ఎన్. లహరి – తృతీయ బహుమతి
జూనియర్ విభాగం – ఎస్. నవ్య – ప్రథమ బహుమతి
వ్యాసరచన (ఇంగ్లీష్):
ఎం. భావ్యష్ – ద్వితీయ బహుమతి
దేశభక్తి గీతాలాపన:
టీవీడి భవాని – తృతీయ బహుమతి
ఫోక్ సాంగ్ (జూనియర్ విభాగం):
కె. అర్చన
ఫ్యాన్సీ డ్రెస్సు పోటీ:
డి. అక్షర – తృతీయ బహుమతి
ఫోక్ డాన్స్ గ్రూప్ (సీనియర్ విభాగం):
ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులు – నిఖిల, మోక్షిత, ప్రసన్న, అస్మిత, నవ్య, మధుప్రియ
ఫోక్ డాన్స్ (సీనియర్ విభాగం):
ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులు – చరిష్మా, వైష్ణవి, పావని, చాతుర్య, సింధు, అనూష
దేశభక్తి గీతాలాపన గ్రూప్:
ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులు – సిరి, అపర్ణ, మోక్షిత, నిఖిల, ప్రసన్న, భవ్య
అదేవిధంగా కన్సోలేషన్ బహుమతులు సాధించిన విద్యార్థులు – జయశ్రీ, హేమలత, మౌళి, గౌతమ్, సాయి దినేష్, శశిధర్, లాస్య, వెంకట్, అపర్ణ, శ్రవణ్, ప్రవల్లిక తదితరులు.ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ స్పేస్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ విలాసను మాట్లాడుతూ, బాలోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన శ్రీ బాలానంద కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని కమిటీని కోరారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు,సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ప్రావీణ్యం అవసరమని, వారి లోని దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఎంతో ముఖ్యమని తెలిపారు.ఇందులో విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.