📢 Advertisement Space

విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర

🗞️ బిబి న్యూస్ | 12 Mar 2026

విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్‌ను ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగం మరియు ఐటీ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ మంత్రి నారా లోకేష్‌కు మళ్ల సురేంద్ర శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం,ఐటీ రంగాన్ని విస్తరించడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.అలాగే యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అన్నారు.ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది