📢 Advertisement Space

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాను మర్యాదపూర్వకంగా కలిసిన కె.కోటపాడు నూతన సీఐ కె.కృష్ణ

🗞️ బిబి న్యూస్ | 17 Feb 2026

అనకాపల్లి, ఫిబ్రవరి 17: అనకాపల్లి జిల్లా కె.కోటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె.కృష్ణ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీకి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.నూతన సీఐ కృష్ణకు జిల్లా ఎస్పీ అభినందాలు తెలిపి, విధి నిర్వహణలో పాటించాల్సిన కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడాలి. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి రవాణా, వేధింపులపై ఉక్కుపాదం మోపాలి. ఫిర్యాదిదారులతో మర్యాదగా ప్రవర్తించి,బాధితులకు సత్వర న్యాయం జరగేలా చూడాలి. రాత్రి గస్తులు ముమ్మరం చేసి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.తమపై అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సీఐ కృష్ణ ఎస్పీకి తెలిపారు.