పెందుర్తి నియోజకవర్గంలో రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం
🗞️ బిబి న్యూస్ | 13 Mar 2026
అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయిన సి యం రమేష్ ఇటీవల జరిగిన రైల్వే సమీక్ష సమావేశంలో సెంట్రల్ పెందుర్తి నియోజకవర్గం పరిధిలో ఉన్న పలు అభివృద్ధి పనులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు ఉపయోగపడే ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆయన సూచించారు.ఈ నేపథ్యంలో రైల్వే శాఖ తక్షణమే స్పందించి సంబంధిత పనుల కోసం నేడు టెండర్ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ – పెందుర్తి రైల్వే మార్గం వద్ద ఉన్న శ్రమ శక్తి నగర్ ప్రాంత ప్రజలకు ఎంతోకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది.శర్మ శక్తి నగర్ ప్రాంత ప్రజలు స్మశాన వాటికకు సురక్షితంగా చేరుకునేలా రోడ్ అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణానికి ప్రతిపాదనను సీఎం రమేష్ రైల్వే మేనేజర్ మరియు జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ద్వారా టెండర్ ప్రకటన జారీ చేశారు.ఈ నిర్మాణానికి సుమారు రూ.1.72 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించి సుమారు 12 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.ఈ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత శ్రమ శక్తి నగర్ ప్రాంత ప్రజలు స్మశాన వాటికకు వెళ్లేందుకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన మార్గం అందుబాటులోకి రానుంది.ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్న సి యం రమేష్ ఈ అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టబడిందని కూటమి నాయకులు తెలిపారు.