📢 Advertisement Space

అనకాపల్లి గవరపాలెంలో శ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ

🗞️ బిబి న్యూస్ | 13 Mar 2026

ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధి పొంది రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానం లో శుక్రవారం భక్తి వాతావరణం నెలకొంది.పీవీఎన్ మాధవ దంపతులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు),ఆలయ సహాయ కమిషనర్ యాళ్ళ శ్రీధర్ కలిసి అమ్మవారి చిత్రపటం మరియు ప్రసాదం అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు,పొన్నగంటి అప్పారావు,ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్,పొలిమేర స్వాతి ఆనంద్,మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు,మజ్జి జానకి శ్రీనివాసరావు,కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు,యర్రవరపు సంతోషి కుమారి నాగేషి తదితరులు పాల్గొన్నారు.