82వ వార్డు ఆత్మీయ సమావేశం – రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న మందపాటి జానకీరామ్
🗞️ బిబి న్యూస్ | 13 Mar 2026
అనకాపల్లి జోన్ పరిధిలోని 82వ వార్డులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మందపాటి జానకీరామ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను 1986 సంవత్సరంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆ కాలంలో ప్రముఖ నాయకులు కొణతాల రామకృష్ణ మరియు దాడి వీరభద్రరావులతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఆయన గుర్తుచేశారు.అయితే తాను ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదని చెప్పారు.తర్వాత మాజీ మంత్రి అమర్నాద్ వచ్చి ఎలాగైనా కార్పొరేటర్‌గా పోటీ చేయాలని కోరినప్పటికీ మొదట తాను నిరాకరించినట్లు తెలిపారు.అయితే మహిళా కోటా నేపథ్యంలో ఇంట్లో ఉండే తన భార్య మందపాటి సునీతను రాజకీయాల్లోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.తన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేసి మంచి పేరు సంపాదించిందని జానకీరామ్ అన్నారు.ఆమె పనితీరుతో ప్రజల విశ్వాసం పొందిందని తెలిపారు.ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వారందరికీ, వార్డు ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరునా మందపాటి జానకీరామ్ ధన్యవాదాలు తెలిపారు.
అనకాపల్లి ప్రజల ఆదరాభిమానాలతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్ పరిధిలోని 82వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన శ్రీమతి మందపాటి సునీత జానకిరామరాజు ఆధ్వర్యంలో వార్డు అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, జీవీఎంసీ అధికారులు, సిబ్బంది సహకారంతో వార్డు పరిధిలో రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వినియోగించినట్లు వెల్లడించారు.వార్డు పరిధిలోని చవితినవీధి, నర్సింగరావుపేట, పాత కరెంట్ ఆఫీస్ వీధి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ వీధి, జి.వి. కోటేశ్వరరావు వీధి తదితర ప్రాంతాల్లో జీవీఎంసీ నిధులతో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. అలాగే పూడిమడక రోడ్ బైపాస్ జంక్షన్ నుంచి ఆర్‌టీసీ కాంప్లెక్స్ మీదుగా నాలుగు రోడ్లు జంక్షన్ వరకు ఆర్ & బి నిధులు మరియు జీవీఎంసీ నిధులతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.శారదా కాలనీ, విజయరామరాజుపేట, గాంధీనగరం, నెహ్రూ చౌక్ జంక్షన్ నుంచి గుండాల జంక్షన్ వరకు, పూడిమడక రోడ్ ఆశీలుమెట్ట జంక్షన్ నుంచి ఫూల్‌బాగ్ మార్గం వరకు పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఫుట్‌పాత్ టైల్స్ నిర్మాణం చేపట్టారు. విజయరామరాజుపేటలో రజకుల కాలనీ నుంచి బర్మా కాలనీ వరకు సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తిచేసినట్లు చెప్పారు.పరశురాంపేట స్మశానవాటికలో రూ.2.67 కోట్ల నిధులతో మౌలిక వసతులు, భవన నిర్మాణం, క్రిమినేషన్ యంత్రం ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. అంజయ్య కాలనీలో రూ.19.50 లక్షలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు.
వార్డు ప్రజల ఆరోగ్యం, వినోదాన్ని దృష్టిలో ఉంచుకుని పరశురాంపేట శారదా నది వద్ద రూ.72.63 లక్షల జీవీఎంసీ నిధులు, రూ.10 లక్షల పార్లమెంట్ నిధులతో ఆధునిక వసతులతో శాంతి పార్క్ నిర్మించారు. అలాగే విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జ్ వద్ద ఓపెన్ జిమ్ పార్క్, గాంధీనగరంలో మహాత్మా గాంధీ పార్క్ నిర్మాణం పూర్తిచేశారు.
ఇక జీవీఎంసీ అనుమతులు పొంది త్వరలో ప్రారంభించనున్న పనుల్లో శ్రీరామ్ నగర్‌లో సామాజిక భవనం నిర్మాణం, నర్సింగరావుపేట పాత బర్మా కాలనీ కాలువలపై కొత్త బ్రిడ్జ్ నిర్మాణం, రామచంద్ర థియేటర్ నుంచి బీఎస్ఎన్‌ఎల్ కార్యాలయం వరకు సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణం, దుర్గాలాడ్జి వీధి, బాబాగారి గుడి పరిసరాల్లో రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. అలాగే ఎన్‌టీఆర్ గ్రౌండ్‌లో వ్యాయామశాల నిర్మాణం కొనసాగుతోంది.ఈ సందర్భంగా 82వ వార్డు ప్రజలకు, సహకరించిన ప్రజాప్రతినిధులు, జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కార్పొరేటర్ మందపాటి సునీత జానకిరామరాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఇటీవల గాంధీనగరంలోని మహాత్మా గాంధీ పార్క్, పరశురాంపేట శారదా నది ఒడ్డున నిర్మించిన శాంతి పార్క్‌లను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మందపాటి జానకీరామ్ మంచి వ్యక్తి అని, ఆయన భార్య సునీత రాజకీయాల్లో ఎంతో చురుకుగా పనిచేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో మహిళలు మరింతగా రాజకీయాల్లోకి రావాలని, రాబోయే రోజుల్లో మహిళలకే రాజకీయాల్లో కీలక పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఇది రిటైర్మెంట్ కార్యక్రమం కాదని, భవిష్యత్తులో మరింతగా ప్రజలకు సేవ చేసే అవకాశాలు వస్తాయని తెలిపారు. అలాగే తన తండ్రి కాలం నుంచి తనతో కలిసి పనిచేసిన వ్యక్తి మందపాటి జానకీరామ్ అని అమర్నాథ్ గుర్తుచేశారు.ఈ సందర్భంగా జరిగిన 82వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్,అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్,అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్,మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ,మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీసెట్టి సత్యవతి, విశాఖ నగర మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి. రామ్మూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు.సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు, అలాగే మీడియా మిత్రులకు జి.వి.ఎం.సి 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకిరామరాజు కృతజ్ఞతలు తెలిపారు.