అనకాపల్లి జిల్లాలోని కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో జూద కార్యకలాపాలపై పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురిని పట్టుకున్నారు.కశింకోట సీఐ ఎ. స్వామి నాయుడు మార్గదర్శకత్వంలో ఎస్‌ఐ మనోజ్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది వారికి అందిన సమాచారంపై తాళ్లపాలెం గ్రామ శివారులో ఆకస్మికంగా దాడి చేపట్టారు. ఈ దాడిలో పేకాట ఆడుతూ జూదానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి 52 పేకాట కార్డులు మరియు రూ.6,200 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.ఇలాంటి అక్రమ జూద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు.