అనకాపల్లి జిల్లాకు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గొంతిన భక్త సాయిరామ్ నియామకం
🗞️ బిబి న్యూస్ | 15 Mar 2026
ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత మరియు పంచభూతాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి జాతీయ స్థాయిలో 2025లో స్థాపించబడిన సంస్థ “నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ (NWC)”. ఈ సంస్థ పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ మరియు సామాజిక సంస్థల సమన్వయంతో పనిచేస్తోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థాగత విస్తరణలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నవ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా గొంతిన భక్త సాయిరామ్‌ను నియమించినట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా గొంతిన భక్త సాయిరామ్ మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు పంచభూతాలు అయిన గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం సంరక్షణపై ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. అలాగే మొక్కలు నాటడం ద్వారా సోషల్ ఫారెస్ట్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.ఈ బాధ్యతను తనపై ఉంచిన నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నవ కుమార్‌కు గొంతిన భక్త సాయిరామ్ కృతజ్ఞతలు తెలిపారు.గొంతిన భక్త సాయిరామ్ ప్రస్తుతం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా, అలాగే కొండకర్ల పి.ఏ.సి.ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.