📢 Advertisement Space

ఘనంగా పలక రవి ఆధ్వర్యంలో సీఎం రమేష్ జన్మదిన వేడుకలు

🗞️ బిబి న్యూస్ | 18 Feb 2026

అనకాపల్లి, ఫిబ్రవరి 18: అనకాపల్లి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పలక రవి ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ జన్మదిన సందర్భంగా బుధవారం లెప్పర్ల కాలనీలో 400 కుటుంబాల పేద మహిళలకు చీరలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని పలక రవి సమర్థవంతంగా నిర్వహించి, పార్టీ సేవా భావాన్ని ప్రదర్శించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ విజయ్ నాయుడు పాల్గొన్నారు. విజయరామరాజుపేట గ్రామ పెద్దలు వినాయక మందిరంలో పూజలు చేసి వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం పేద మహిళలకు వస్త్రాలు పంపిణీ చేశారు.ఈ ఉత్సవంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కర్రీ రామకృష్ణ, బోడ్డెడ నాగేశ్వరరావు, పోలవరపు త్రినాధ్, కోటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పలక రవి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ సామాజిక సేవలకు మరో ఉదాహరణగా నిలిచింది.