ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి జాతరకు మంత్రులు, శాసనసభ్యులు దర్శనం
🗞️ బిబి న్యూస్ | 18 Mar 2026
అనకాపల్లి జిల్లా, మార్చి 18: శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర సందర్భంగా అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, చిన్న మరియు మధ్యతర పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్, APUFIDC చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ లు అమ్మవారి దర్శనం చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు.వీరందరినీ మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ స్వాగతం పలికారు.ఆలయ కార్యవర్గం, సిబ్బంది పూర్ణకుంభాలు, మంగళ వాయిద్యాలతో స్వీకరించారు.ప్రత్యేక పూజల ఆశీర్వచనం తర్వాత పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండల సభ్యుడు బుద్ధ నాగ జగదీశ్, ఏపీ గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ధర్మకర్తలు, కార్యనిర్వాహణ అధికారి వై శ్రీధర్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.