📢 Advertisement Space

అనకాపల్లి జిల్లా కృషి శాస్త్రవేత్తకు రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం

🗞️ బిబి న్యూస్ | 19 Mar 2026

విజయవాడ, మార్చి 19: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆహ్లాదకరంగా జరిగిన రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాల కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎం. రాజ్ కుమార్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'ఉత్తమ శాస్త్రవేత్త' అవార్డును బహుమతిగా ఇచ్చారు.వ్యవసాయ రంగంలో అసాధారణ సేవలు అందించిన రాజ్ కుమార్‌ను సీఎం చంద్రబాబు నాయుడు సహృదయ వంగ్మూలలతో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, రాజ్ కుమార్ పరిరిశోధనలు రైతులకు గొప్ప ఆధారం అవుతున్నాయని,రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి వారి సేవలు అమోఘమని ప్రశంసించారు.ఈ పురస్కారం అనకాపల్లి జిల్లా ప్రజలను గర్వపడేలా చేసింది.రాజ్ కుమార్ విజయాన్ని జిల్లా ప్రజలు, సహోద్యోగులు అందరూ స్వాగతించారు.