📢 Advertisement Space

బైక్ ప్రమాదంలో గాయపడిన జనసేన గోపిని ఫోన్‌లో పరామర్శించిన కొణతాల

🗞️ బిబి న్యూస్ | 20 Mar 2026

అనకాపల్లి మండలం కొప్పాక గ్రామానికి చెందిన జనసేన నాయకుడు గోపి నాలుగు రోజుల క్రితం బైక్ ప్రమాదంలో కాలుకు గాయపడి సర్జరీ చేయించుకున్నాడు.ఈ విషయం తెలిసిన అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పార్టీ అనకాపల్లి ఇంచార్జి భీమరశెట్టి రాంకీని పరామర్శించమని ఆదేశించారు.రామకృష్ణ ఆదేశాల మేరకు అందరికీ అందుబాటులో ఉండే రాంకీ తక్షణమే గోపి స్వగృహానికి చేరుకుని ఆరోగ్యం తెలుసుకున్నారు. అక్కడనే రామకృష్ణ ఫోన్‌లో గోపిని పరామర్శించి, "ఏ అవసరమైనా మేమున్నాము" అంటూ ధైర్యం చెప్పారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.రాంకీ సందర్శనకు గోపి పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "తమ మనిషి కష్టంలో తక్షణమే స్పందించే నాయకుడు మా రామకృష్ణ" అని పేర్కొన్నారు.ఈ సందర్భంలో కొప్పాక జనసేన నాయకులు 84వ వార్డు ఇంచార్జి దుర్గప్రసాద్, పొలిమేర బాలాజీ, బత్తిన జగదీష్, గిరీష్, రాజా తదితరులు పాల్గొన్నారు.