📢 Advertisement Space

అనకాపల్లి నూకాలమ్మ గుడి దగ్గర అధిక శబ్ద సమస్య.. విద్యార్థులు ఇబ్బంది!

🗞️ బిబి న్యూస్ | 20 Mar 2026

అనకాపల్లి: అనకాపల్లి నూకాలమ్మ గుడి చుట్టూ పక్కల వీధిలో సౌండ్ స్పీకర్ హారన్లు వేసి అధిక శబ్దం చేయడం వల్ల ప్రజలు,ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.టెన్త్,ఇంటర్ పరీక్షలు జరుగుతున్న ఈ సమయంలో ఈ సమస్య మరింత తీవ్రతరం కావడంతో స్థానికులు పరీక్షలు అయ్యేవరకు సౌండ్ ఆపాలని అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు విన్నపం చేశారు.సౌండ్ స్పీకర్ హారన్లు తక్కువ శక్తితో ఎక్కువ శబ్దం అందించే అధిక సామర్థ్య పరికరాలు. బహిరంగ ప్రదేశాలు, సభలు, ప్రార్థనా మందిరాలు, వాహనాల్లో ప్రకటనలకు ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో కూడా ఈ హారన్లు ఉపయోగిస్తున్నారు. ఆదివారం భక్తులు ఎక్కువగా వస్తారని తెలిసినా, ఇటీవల సాయంత్రం గుడి ఖాళీగా ఉన్నప్పటికీ పెద్ద సౌండ్‌తో శబ్ద ప్రబలం జరిగింది.స్థానికులు అన్నారు, "ఈ అధిక శబ్దం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.పరీక్షల సమయంలో విద్యార్థులు చదువుతున్నారు.దయచేసి దేవాదాయ శాఖ అధికారులు త్వరగా పరిష్కారం చేయాలి" అంటూ. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.