📢 Advertisement Space

బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎం.వి.ఆర్..!

🗞️ బిబి న్యూస్ | 21 Mar 2026

విశాఖపట్నం: అనకాపల్లి జిల్లానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విచ్ఛేదించదనీయ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఎం.వి.ఆర్‌తో పాటు సుమారు 100 మంది అనుచరులు, స్థానిక సర్పంచులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై, ప్రజల సేవలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో చేరినట్లు ఎం.వి.ఆర్ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన పి.వి.ఎన్. మాధవ్, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనకాపల్లి ప్రాంతంలో పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ, రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని పార్టీ నేతలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముదుర్తి సర్పంచ్ కడిమి వెంకట్, బంగారం మెట్ట నానాజీ, గంటా సూరిబాబు, నర్సీపట్నం జానకి, గాలి శ్రీను, గైపూరు రాజు, వాసు, పోలవరపు లోకేష్ తదితరులు, అధిక సంఖ్యలో ఎం.వి.ఆర్ అభిమానులు పాల్గొన్నారు