నక్కపల్లి పర్యటన విజయవంతం చేయాలి.. రింగ్ రోడ్‌లోని జనసేన కార్యాలయంలో కూటమి నాయకుల సమావేశం
🗞️ బిబి న్యూస్ | 22 Mar 2026
అనకాపల్లి, మార్చి 22: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నక్కపల్లి పర్యటన విజయవంతం చేయాలని కోరుతూ, రింగ్ రోడ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రులు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.పిఠాపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ వర్మ ,మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ,టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు , మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ,గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర , డీసీఎంఎస్ చైర్మన్ కొట్ని బాలాజీ తదితరులు హాజరయ్యారు.కూటమి నాయకులు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అవసరమైన సహకారం అందించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించేలా ప్లాన్ చేయాలని చర్చించారు.ఈ కార్యక్రమం కూటమి ఐక్యతకు మరో ఉదాహరణగా మారింది.