శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి
🗞️ బిబి న్యూస్ | 22 Mar 2026
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర సందర్భంగా పాయకరావుపేట శాసనసభ్యురాలు, హోమ్ మంత్రి అనిత,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వీరిని మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ స్వాగతం పలికారు.ఆలయ కార్యవర్గం,సిబ్బంది పూర్ణకుంభాలు, మంగళ వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో APUFIDC చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ, మాజీ శాసన మండల సభ్యుడు బుద్ధ నాగ జగదీష్, హౌసింగ్ కార్పొరేషన్ బత్తుల తాతయ్య బాబు, గవర కార్పొరేషన్ చైర్మన్, డీఈ సుజాత, ఆర్డీవో, ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను, ధర్మకర్తలు, కార్యనిర్వాహణ అధికారి వై శ్రీధర్, 81వ టిడిపి ఇంచార్జ్ జోగి నాయుడు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.