📢 Advertisement Space

అనకాపల్లి నియోజకవర్గంలో సీఎం రమేష్ జన్మదినోత్సవ వేడుకలు: టీడీపీ శ్రేణులు ఘనంగా సేవా కార్యక్రమాలు

🗞️ బిబి న్యూస్ | 18 Feb 2026

అనకాపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు, రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి.అనకాపల్లి పట్టణం, ఎన్‌టీఆర్ జిల్లా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అదే ఆసుపత్రి అన్నా క్యాంటీన్‌లో పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం జరిగింది.అనకాపల్లి మండలం తుమ్మపాల పీహెచ్‌సి ఆసుపత్రిలో కూడా గర్భిణీలకు, రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు.అనకాపల్లి మండలం సుందరయ్యపేట గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేశారు. తుమ్మపాల మేజర్ పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు, పండ్లు పంచారు.ఎన్‌టీఆర్ జిల్లా ఆసుపత్రిలో పండ్లు, రొట్టెలు పంపిణీలో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర , ఎంపీ కార్యాలయం ప్రతినిధి విజయ్, పట్టణ టీడీపీ అధ్యక్షులు కెకెవిఏ నారాయణరావు మొదలైనవారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల ద్వారా స్థానికులలో సీఎం రమేష్ పట్ల గౌరవం, టీడీపీ పార్టీ పట్ల మరింత ఆదరణ పెరిగిందని నివాసులు అభిప్రాయపడ్డారు.