జలవనరుల శాఖ ఆధ్వర్యంలో 'నీటి భద్రత-సాగు నీటి వినియోగదారుల సంఘాల భాధ్యత' కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఎన్నికల హామీని 20 నెలల్లోనే నెరవేర్చారు.2024 ఎన్నికల ప్రచారంలో తుమ్మపాల గ్రామంలో రైతులకు ఇచ్చిన గ్రోయిన్ పునరుద్ధరణ హామీని కొణతాల రామకృష్ణ త్వరగా పూర్తి చేశారు. శారదా నదిపై ప్రమీల నగర్ స్మశానవాటిక దగ్గర ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మతులకు డి.ఎం.ఎఫ్.టి. నిధులతో రూ. 1.19 కోట్లు మంజూరు చేయించారు.అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో కలిసి కొణతాల రామకృష్ణ శంకుస్థాపన చేశారు.ఈ గ్రోయిన్ ద్వారా 1500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతుంది. ఇకపై నీటి ఎద్దులు లేకుండా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.150 నుంచి 200 ఎకరాల రైతులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు.గ్రోయిన్ పరిశీలించి అధికారులతో సమీక్షలో తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ ఆయేషా, ఎంపీడీవో, ఎమ్మార్వో, డీఈలు, ఏఈలు, నీటిపారుదల అధికారులు, నీటి సంఘాల చైర్మన్లు, కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.