జన్మదినాన కామాఖ్యా అమ్మవారి ఆశీస్సులుగౌహతిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనకాపల్లి ఎం.పీ
🗞️ బిబి న్యూస్ | 18 Feb 2026
అనకాపల్లి, ఫిబ్రవరి 18: రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ తన జన్మదిన సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి అస్సాం రాష్ట్రంలోని గౌహతి కామాఖ్య దేవాలయాన్ని సందర్శించారు. శక్తి స్వరూపిణి కామాఖ్యా అమ్మవారిని భక్తిభావంతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ దేశ ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతి, సమృద్ధి కలగాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక అర్చనలు చేశారు. "జన్మదినాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభించడం అతి ఆనందంగా ఉంది" అని ఎంపీ తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ , ప్రజల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ కొనసాగాలని కోరారు.