బిబి న్యూస్ కథనానికి స్పందన.'అక్రమ నిర్మాణాలకు ఎప్పుడూ వ్యతిరేకం'కొత్తూరు పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ:
🗞️ బిబి న్యూస్ | 08 Apr 2026
కొత్తూరు, ఏప్రిల్ 8: ఉదయం బిబి న్యూస్లో వచ్చిన "ఎగువ వంతెన కింద అక్రమ నిర్మాణాల హడావిడి... అధికారులు ఎక్కడ?" అనే కథనానికి తక్షణమే స్పందించిన కొత్తూరు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, హుటాహుటిగా స్థలానికి చేరుకుని దుకాణాల నిర్మాణాన్ని ఆపేశారు.దుకాణదారులతో మాట్లాడుతూ, "అక్కడి నిర్మాణాలు తక్షణమే తొలగించాలాలని పోలీసులు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.ఇటువంటి ఆక్రమణలకు అధికారులు ఎప్పుడూ వ్యతిరేకమే అని ఇటువంటి ఆరోపణలు వస్తే సహించేది లేదు"అని స్పష్టం చేశారు.నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.