అనకాపల్లి కొత్తూరు పంచాయతీలో అనధికార నిర్మాణాలు: పర్యవేక్షణ లోపం విమర్శలకు గురి
🗞️ బిబి న్యూస్ | 11 Apr 2026
అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలో జియో ఆఫీస్ ఎదురుగా ఎగువ వంతెన కింద నూతన రేకుల షెడ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ షెడ్లు దుకాణాల కోసం ఏర్పాటు చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు.పంచాయతీ సర్పంచ్‌ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో స్థానిక పరిపాలనలో స్పష్టమైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి నిర్మాణాలు నియంత్రణ లేకుండా జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో అనుమానాలను పెంచుతోంది.ఎగువ వంతెన కింద ఈ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు స్థానికులు. ఆర్ అండ్ బి, విద్యుత్ సరఫరా అధికారులు అనుమతులు ఇచ్చారా, అధికార ఒత్తిళ్లు లేదా లంచాలకు గురయ్యారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పుడైనా విద్యుత్, సంబంధిత అధికారులు సరఫరా నిలిపివేసి షెడ్లను తొలగించడానికి సహకరించాలని లేదంటే చర్యలు తప్పవని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.