📢 Advertisement Space

చోడవరం నియోజవర్గం బోగస్ ఓటర్ల తొలగింపు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఈర్ల శ్రీరామమూర్తి నియామకం

🗞️ బిబి న్యూస్ | 11 Apr 2026

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజవర్గం: భారతదేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు ఉన్నాయని గ్రహించిన ఎన్నికల సంఘం, నిజమైన ఓటర్లను గుర్తించి మరణించినవారు, ఇతర ప్రాంతాల్లో రెండు ఓట్లు ఉన్నవారిని తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా చోడవరం నియోజవర్గం నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఈర్ల శ్రీరామమూర్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ BLA-1 పదవికి నియమించారు.చోడవరం నియోజవర్గంలోని 4 మండలాలకు నిర్వాహకుడిగా ఈర్ల శ్రీరామమూర్తినే నియమించడం జరిగింది. రావికమతం మండలానికి BLA-2 పదవికి కూడా ఈర్ల శ్రీరామమూర్తి చేతుల మీదుగా సత్యనారాయణకు నియామక పత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి మాత్రమే కాకుండా, 'మన ఊరి మన జెండా' కార్యక్రమంలో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా దిమ్మ ఉండాలని ఈర్ల శ్రీరామమూర్తి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రావికమతం మండల బీజేపీ అధ్యక్షుడు గూటాల చిన్న హాజరుకు వచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా శుద్ధి చేసి, నిజాయితీగా ఎన్నికలు జరిగేలా చేయాలనే లక్ష్యంతో బీజేపీ కార్యకర్తలు ముందుండాలని నాయకులు సూచించారు.