అనకాపల్లి, ఏప్రిల్ 12: అనకాపల్లి పట్టణం మెయిన్ రోడ్‌లో CMR మావూరి వెంకటరమణ నూతన పద్మం జువెలరీస్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యుడు, అనకాపల్లి నియోజవర్గం టీడీపీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ తదరపరిచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనకాపల్లి జిల్లాలో జిల్లా హెడ్‌క్వార్టర్‌గా పద్మం జువెలరీస్ ప్రారంభించడం చాలా సంతోషకరమని ఆయన వ్యక్తం చేశారు. విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు అనకాపల్లిలోనే ఉత్తమ ఆభరణాలు అందుబాటులో ఉండటం గొప్ప విషయమని, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.