📢 Advertisement Space

ఎగ్ కార్ట్ ప్రారంభోత్సవం

🗞️ బిబి న్యూస్ | 13 Apr 2026

అనకాపల్లి పట్టణంలోని జీవీఎంసీ 82వ డివిజన్ కు చెందిన డ్వాక్రా మహిళ సంతోషి కుమారి ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం–నేషనల్ ఎగ్ కో‑ఆర్డినేషన్ కమిటీ సంయుక్త పథకం కింద రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్, గ్యాస్ స్టవ్, వంట సామాగ్రి, కస్టమర్ల కోసం బెంచీలు పూర్తి ఉచితంగా అందజేశారు.సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయ ఎదురుగా ఈ కార్ట్ దుకాణాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్ కార్ట్ దుకాణాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతానికి పలు పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.ఎగ్ కార్ట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు స్వయం ఉపాధి పొంది ఆదాయం పెంచుకోవాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–నేషనల్ ఎగ్ కో‑ఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్లు, వంట సామాగ్రి, గ్యాస్ స్టవ్, ఫర్నిచర్‌లు పూర్తి ఉచితంగా అందజేస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 260 ఎగ్ కార్ట్లు (ప్రతి జిల్లాకు 10 మంది చొప్పున) ఏర్పాటు చేస్తున్నారు.మహిళలు గుడ్లు, గుడ్డు పదార్థాలు విక్రయించి నెలకు రూ.15,000–20,000 వరకూ సంపాదించే అవకాశం కల్పించడమే ప్రధాన లక్ష్యం.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఆళ్ల రామచంద్రరావు, 84వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ మాదంశెట్టి నీల బాబు, 80వ డివిజన్ టిడిపి ఇంచార్జ్ బొడ్డేడ జోగినాయుడు, 82వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ పోలారపు త్రినాథ్, 83వ డివిజన్ జనసేన ఇన్చార్జ్ మంగా ఈశ్వర్, 84వ డివిజన్ జనసేన ఇన్చార్జ్ చేబోలు దుర్గాప్రసాద్, GVMC అధికారులు, DRP ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ ల కృషితో పట్టణంలో ఈ ఎగ్ కార్ట్ మంజూరైందని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.