డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కోరిబిల్లీ పరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
🗞️ బిబి న్యూస్ | 13 Apr 2026
అనకాపల్లి, ఏప్రిల్ 13: ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సర్వేజనా ఐక్యవేదిక, NHRPF హ్యూమన్ రైట్స్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కోరిబిల్లీ పరి ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విజయ రెసిడెన్సీ హోటల్‌లో ఉదయం 8 గంటలకు రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.స్థానిక గవరపాలెం ప్రాంతంలో కరపత్రాల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుంధతి నగర్ పెద్దలు పాల్గొన్నారు. సామాజిక సేవలో పాల్గొనేందుకు స్థానికుల అప్పీల్ చేస్తూ కార్యకర్తలు ప్రచారం చేశారు.