అనకాపల్లి, ఏప్రిల్ 14: భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా (ఏప్రిల్ 15) మంగళవారం ఉదయం 9:30 గంటలకు భీముని గుమ్మం వద్ద ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఘన ఉత్సవాలు జరుగనున్నాయి.చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశంలో 1944 సెప్టెంబర్ 28న అంబేద్కర్ అడుగుపెట్టారు. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి మాజీ శాసనసభ్యులు, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య, మాజీ ఎంఎల్సీ బుద్ధ నాగ జగదీశ్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆది ఆంధ్ర సంఘం ప్రెసిడెంట్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.